🌸🌻🌺  ప్రియ పుష్పాలు   🌺🌻🌸
పూజకు సిద్ధమై పోయారా?మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటకి పూలు తెద్దాం.అన్నట్టు విష్ణువుకి  ఇష్టమైన పూలేంటో తెలుసా!
 ఇవిగో.....👇

అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః
సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః
జ్ఞాన  పుష్పం  తప: పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ 
సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్ !!

1.అహింసా పుష్పం:
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.

 2.ఇంద్రియ నిగ్రహం:
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.

 3.దయ:
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

 4.క్షమ:
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

 5.ధ్యానం:
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.

 6.తపస్సు:
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.

 7.జ్ఞానం:
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

 8.సత్యం:
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
 
అవి చాలా అరుదైన పుష్పాలు,అవి మా తోటలో అన్ని లేవే అంటున్నారా!మరేం పర్లేదు,ఇవాళే మొక్కలు నాటండి.🌱🌾🌴
త్వరలోనే మిగతా పూలు పూయించండి. మీరంతా వచ్చే ఏడాది పూజ వాటితోనే చేస్తారని ఆశిస్తూ.....
🌺🌷🥀🌹🌸🌺🌷🥀🌹🌸🌺

Comments

Popular posts from this blog

వైకుంఠ ద్వార దర్శనము Fremont గుడి లో

100% literacy for India by 2020